మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సందడి మొదలు కాబోతోంది. అయితే ఓవర్సీస్లో మాత్ర అప్పుడే రచ్చ స్టార్ట్ అయిపోయింది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్ వార్ పెరిగిపోతోంది. బాలయ్య సినిమాకు వస్తున్న బుకింగ్స్ చూసి.. యుఎస్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి.. శ్లోక ఎంటర్టైన్మెంట్స్ పై మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారట. ఓవర్ సీస్లో ఇప్పటి వరకు ఓపెన్ చేసిన థియేటర్స్‌లో 90 శాతం బుకింగ్స్ జరిగియాయట. అయినా డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా కొత్త లొకేషన్స్‌లో బుకింగ్స్ ఓపెన్ చేయటం లేదట. అందుకే వాల్తేరు వీరయ్య రేసులో వెనకబడిపోయాడని అంటున్నారు. ఇప్పటికు వరకు వీరసింహారెడ్డి ప్రీ సేల్స్ నాలుగు లక్షల డాలర్స్ క్రాస్ చేసినట్టు ప్రకటించారు. అలాగే వాల్తేరే వీరయ్య 3 లక్షల 50 వేల డాలర్స్ ప్రీ సేల్స్ బిజినెస్ జరుపుకుందని అంటున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ డిస్ట్రీబ్యూటర్స్ పై కాస్త అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓవర్సీస్లో వాల్తేరు వీరయ్యకు అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్స్ జరగడం లేదని.. మరిన్ని లొకేషన్లలో బుకింగ్స్ ఓపెన్ చేయాలని మండిపడుతున్నారట. అయితే ఎటు చూసినా.. ఓవర్సీస్ వార్‌లో బాలయ్యదే పై చేయిగా కనిపిస్తోంది. అలాగే వీరయ్య దూకుడు కూడా గట్టిగానే ఉంది. ఇక వీర సింహా రెడ్డి జనవరి 12న రిలీజ్ అవుతుండగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ అవనుంది. వాల్తేరు వీరయ్యను బాబీ దర్శకత్వం వహంచగా.. వీరసింహారెడ్డిని గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఇప్పటికే ట్రైలర్స్‌తో తమ అభిమాన హీరోని ఎలా చూపించబోతున్నారో హింట్ ఇచ్చేశారు ఈ ఇద్దరు. అందుకే థియేటర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.. మెగా, నందమూరి అభిమానులు.