సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి.. కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన జక్కన్న.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నానని చెప్పేశాడు రాజమౌళి. అందుకే మహేష్ ప్రాజెక్ట్ పై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా.. సెన్సేషన్‌గా నిలుస్తోంది. తాజాగా ఓ బిగ్ అప్టేట్ సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాలను షేక్ చేస్తోంది. ఈ సినిమాను బిగ్గెస్ట్ అడ్వెంచరస్ డ్రామాగా ఫ్రాంచైజ్‌లా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. మహేష్ ప్రాజెక్ట్‌ను ఫ్రాంచైజ్‌లా పలు భాగాలుగా రూపొందించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఫ్రాంచైజ్‌లో కథలు మారతాయి కానీ.. ప్రధాన పాత్రలు మారవని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. దాంతో ఈ సినిమా అవతార్ ఫ్రాంఛైజీలా… అవెంజర్స్ సిరీస్‌లా ఉంటుందని చెప్పొచ్చు. అన్ని పార్ట్స్లోను మహేష్‌బాబే హీరోగా నటించనున్నాడు. అన్నీ కుదిరితే వచ్చే సమ్మర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 చేస్తున్నాడు మహేష్‌బాబు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. దీని తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నాడు మహేష్. మరి రాజమౌళి, మహేష్ ఎలాంటి ఫ్రాంచైజ్‌లు చేస్తారో చూడాలి.