Kamal Haasan-Mani Ratnam Movie: విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) .. క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ మణిరత్నం.. వీరి కాంబోలో మరో మూవీ రానుంది. 25 ఏళ్ల క్రితం వీరిద్దరూ కలిసి నాయకుడు (nayakudu) అనే సినిమా తీశారు. ఆ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో.. ఎన్ని అవార్డ్స్ (awards) తెచ్చింది అందిరికీ తెలసిందే. KH234 మూవీని కమల్- మణిరత్నం చేస్తున్నారు. ఆ మూవీలో ఇతర పాత్రలు, హీరోయిన్ గురించి ప్రకటించలేదు. కమల్ హాసన్‌కు (kamal haasan) తెగ భయం పట్టుకుందట.
కొత్త మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరో నాయకుడు అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. మరో అద్భుతం ఆవిష్కృతం అవుతుందని, ఫ్యాన్స్ (fans) భారీగా ఆశలు పెట్టుకున్నారు. దీంతో కమల్ హాసన్‌కు (Kamal Haasan) భయం పట్టుకుంది. తమ మూవీపై అంచనాలు చూస్తే కంగారుగా ఉందని అంటున్నారు. ఒత్తిడికి గురి అవుతున్నానని సన్నిహితులతో అన్నారట. ఇన్నేళ్ల సినీ జర్నీలో ఏ రోజు ఇలాంటి అనుభూతికి గురికాలేదట. ఇందుకు కారణం ఫ్యాన్స్ మూవీపై పెట్టుకున్న అంచనాలేనని చెబుతున్నారు.
నాయకుడు స్థాయిలో కొత్త మూవీ ఉంటుందని.. మరో రెండు, మూడు నెలల్లో మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. కమల్ హాసన్‌కు (Kamal Haasan) జతగా హీరోయిన్ త్రిష (trisha) నటించనుంది. తొలుత లేడీ సూపర్ స్టార్ నయనతార (nayanatara) పేరు వినిపించింది. ఇప్పు త్రిష పేరు కన్ఫామ్ అయ్యిందని తెలుస్తోంది. కమల్-త్రిష కాంబోలో ఇదీ మూడో మూవీ కానుంది. తూంగవనం, మన్మధన్ అంబూ సినిమాల్లో లోక నాయకుడితో కలిసి త్రిష్ నటించింది. మణిరత్నం ఛాన్స్ ఇస్తే.. ముచ్చటగా మూడో మూవీ చేస్తోంది. మణిరత్నం (mani ratnam) సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు.