»Hero Siddharth Said Indian 2 Ten Times More Than Indian
Indian2: భారతీయుడు కంటే 10 రెట్లు మించి ఉంటుంది!
భారతీయుడి కంటే భారతీయుడు 2 చిత్రం పది రెట్లు ఎక్కువ ఉంటుందని హీరో సిద్ధార్థ్(hero siddharth) అంటున్నారు. అంతేకాదు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ సరసన తనకు నటించే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
కమల్ హాసన్ భారతీయుడు సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ సినిమా ఓ సెన్సేషన్. కాగా.. చాలా కాలం తర్వాత ఈ సినిమాకి సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా భారతీయుడు సినిమాకి పదిరెట్లు మించి ఉంటుందట. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ భారతీయుడు 2(indian2) శరవేగంగా సాగుతోంది. ఇందులో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.
ఈ చిత్రంలో సిద్ధార్థ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సిద్ధార్థ్(hero siddharth) ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచాడు. ఇండియన్ కంటే ఇండియన్ 2 పదిరెట్లు శక్తివంతమైన అనుభవాన్ని ఇస్తుందని అన్నారు. తన ఇద్దరు గురువులు కమల్ హాసన్, శంకర్‌లతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉందని ఆయన అన్నారు. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అవకాశం అని అన్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి అనే స్వాతంత్య్ర సమరయోధుడిగా మారారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, బాబీ సింహా, గురు సోమసుందరం కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి రత్నవేలు, రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.