H Siddharth: ఆమెను చూడగానే సిద్దార్థ్ ఎందుకు ఏడ్చాడు!?
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటేడ్ హీరోగా ఉన్న సిద్దార్థ్.. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తునే ఉన్నాడు. తాజాగా 'టక్కర్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో.. ఒక పెద్దావిడను చూడగానే బోరున ఏడ్చేశాడు సిద్ధార్థ్. మరి ఆమె ఎవరు? ఈ హీరో ఎందుకు ఏడ్చాడు?
స్టార్ డైరెక్టర్ శంకర్ చేసిన ‘బాయ్స్’ సినిమాతో.. హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు సిద్ధార్థ్. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు సిద్ధు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఆ తర్వాత మినిమం గ్యారెంటీ సినిమాలు చేశాడు. కానీ ఈ మధ్య రేసులో వెనకబడిపోయాడు సిద్ధు. అయినా కూడా ప్రస్తుతం శంకర్‌తో ఇండియన్ 2లో నటిస్తున్నాడు. 20 ఏళ్ల తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన శంకర్‌తో సినిమా చేయడం తన అదృష్టం అంటున్నాడు. అలాగే ఇంకొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.
అయితే తాజాగా టక్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సిద్దార్థ్. ఈ సందర్భంగా కొన్ని గత కొన్ని రోజులుగా తెలుగు , తమిళ్ మీడియాలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సిద్దార్థ్. తాజాగా సిద్దు ఓ తమిళ్లో ఒ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో సిద్దార్థ్ ఇరవై ఏళ్ల కెరీర్ గురించి ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో.. సిద్దార్థ్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు అక్కడున్న వారు. సడన్‌గా అక్కడకు తమిళ్ సినీ పరిశ్రమకు చెందిన సుజాత రంగరాజన్ రావడంతో సిద్ధార్థ్ ఒక్కసారిగా ఏడ్చేశాడు.
ఆమె పాదాలకు నమస్కారం చేయడమే కాకుండా.. ఆమెను పట్టుకొని గట్టిగా ఏడ్చేశారు. ఎందుకంటే.. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ్‌ను తీసుకోవాలని శంకర్‌కు ఆమెనే సూచించారట. అందుకే శంకర్.. సిద్ధార్థ్‌కు ఛాన్స్ ఇచ్చాడట. దాంతో సుజాతను చూడగానే సిద్దు ఎమోషనల్ అవుతూ ఆమె కాళ్ళపై పడిపోయి కన్నీరు పెట్టుకున్నాడు. ఆమె లేకపోతే ఈ ఇరవై ఏళ్లు ఇలా ఉండేవి కాదని చెప్తూ భావోద్వేగం చెందాడు. ప్రస్తుతం సిద్దార్థ్ కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది.