»Aditi Birthday Wishes For Siddharth Love Matter Confirmed
Mumbai : సిద్ధార్థ్‌కి అదితి బర్త్ డే విషెస్..లవ్ మేటర్ కన్ఫర్మ్ చేశారా?
ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మహా సముద్రం'(Maha samudram)లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. అందులో శర్వానంద్ (Sharwanand) హీరో అయినప్పటికీ... సిద్ధార్థ్‌తో అదితి ప్రేమలో పడినట్టు చూపించారు. ఆ సినిమా చేసే సమయంలో నిజ జీవితంలోనూ ఇద్దరు ప్రేమలో పడినట్టు గుసగుస. ఇప్పుడు అదితి చేసిన పోస్టుతో అది నిజమని తేలిందని నెటిజనులు భావిస్తున్నారు.
హీరో సిద్దార్థ్ (Hero Siddharth) , అదితి రావు రిలేషన్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా(Social media), పార్టీస్, ఫంక్షన్స్, ముంబై (Mumbai) విధులో ఇద్దరు చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ తెగ సందడి చేస్తున్నారు. తాజాగా సిద్దార్థ్ పుట్టిన రోజు కావడంతో అదితి (Aditi) ఒక రీల్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సిద్దార్థ్ అండ్ అదితి ఫారిన్ (Foreign) విధుల్లో సరదాగా గంతులు వేస్తూ పరుగులు పెడుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి.అలాగే సిద్దార్థ్ కి బర్త్ డే విషెస్ (Birthday wishes) చెబుతూ అదితి ఇలా రాసుకొచ్చింది.. “హ్యాపీ బర్త్ డే మానికార్న్.
ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ప్రేమని పంచుతుంటావు, మంచి హృదయంతో స్ట్రాంగ్ గా ఉంటావు. ఎన్నో నవ్వులను తీసుకు వస్తావు. అసలు ఎదగకుండా ఎప్పటికి యవ్వనంగానే ఉంటావు. ఎప్పటికి ఇలాగే ఉండు. హ్యాపీ సిద్దు డే” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ప్రేమ గురించి సిద్దార్థ్ (Siddharth) అండ్ అదితి మాత్రం సరైన జవాబు చెప్పడం లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అదితిని దీని గురించి ప్రశ్నించగా.. జనాలు వాళ్లకి ఏది వినాలని కోరుకుంటారో, దాని గురించే మాట్లాడుకుంటారు. మనం వాళ్ళని ఆపలేము అంటూ చెప్పుకొచ్చింది.