»Hero Siddharth Gave A Shocking Reply About Love Failure
Siddarth: లవ్ ఫెయిల్యూర్ గురించి షాకింగ్ రిప్లై ఇచ్చిన హీరో సిద్దార్థ్
‘టక్కర్’ (TAKKAR) సినిమా కథ చెప్పిన వెంటనే తనకెంతో నచ్చేసిందని, ముఖ్యంగా లవ్‌స్టోరీ, అందులోనూ హీరోయిన్ పాత్ర విభిన్నంగా అనిపించాయన్నారు. ఇది తప్పకుండా కమర్షియల్ హిట్ అవుతుందని హీరో సిద్దార్థ్ అన్నారు.
హీరో సిద్ధార్థ్(Hero siddarth) లవ్ పెయిల్యూర్ గురించి రిపోర్టర్‌కు షాకింగ్ రిప్లై(Shocking Reply) ఇచ్చాడు. తాజాగా ఆయన ‘టక్కర్’ (TAKKAR) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో సిద్దార్థ్ కు అనుకోని ప్రశ్న ఎదురైంది. ‘‘రీల్ లైఫ్‌లో విజయవంతమైన ప్రేమకథల్లో నటించిన మీరు ప్రేమలో సక్సెస్ కాలేకపోయారు? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా?’’ అని ఓ రిపోర్టర్ అడిగారు.
రిపోర్టర్ ప్రశ్నకు హీరో సిద్దార్థ్(Hero siddarth) స్పందిస్తూ..‘‘ఇలాంటి విషయం గురించి ఇప్పటివరకూ నేను ఆలోచించలేదు. కానీ, నా రియల్‌లైఫ్ లవ్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి, మనిద్దరం పర్సనల్‌గా కూర్చొన్నప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే, ఈ ప్రెస్‌మీట్‌కు దానికి అసలు సంబంధం లేదు’’ అంటూ ఫైర్ అయ్యారు.
‘టక్కర్’ (TAKKAR) సినిమా కథ చెప్పిన వెంటనే తనకెంతో నచ్చేసిందని, ముఖ్యంగా లవ్‌స్టోరీ, అందులోనూ హీరోయిన్ పాత్ర విభిన్నంగా అనిపించాయన్నారు. ఇది తప్పకుండా కమర్షియల్ హిట్ అవుతుందని, ఈ మూవీ తర్వాత ప్రతి మూడు నెలలకు తన సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు. ‘మహా సముద్రం’ సినిమా తర్వాత సిద్దార్థ్(Hero siddarth) నటించిన చిత్రం ‘టక్కర్’ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి శంకర్ అసిస్టెంట్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 9న ఈ సినిమా విడుదల కానుంది.