స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. మూవీ మేకర్స్ కోట్లు కుమ్మరించాల్సిందే. మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడు డైరెక్టర్ శంకర్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు.. అనుకున్న ఔట్ పుట్ రావాల్సిందే. అంతేకాదు.. సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలన్నా కూడా శంకర్‌దే డెసిషన్. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజునే చెప్పడం విశేషం.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ శంకర్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఒక్కో సాంగ్‌కు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు శంకర్. ఏకంగా 90 కోట్లకు పైగా ఖర్చు చేశారనే టాక్ ఉంది. మొత్తంగా రెండు మూడొందల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులే అవుతోంది.
మధ్యలోకి కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ తిరిగి పట్టాలెక్కడంతో ‘గేమ్ చేంజర్’ డిలే అవడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తునే ఉన్నారు. అయినా కూడా దిల్ రాజు రెస్పాండ్ అవడం లేదు. తాజాగా వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దిల్‌రాజు హాజరవగా.. గేమ్ చేంజర్ అప్డేట్ అడిగారు అభిమానులు. దీంతో అప్డేట్స్ కావాలంటే శంకర్‌ను అడగాలని అన్నారు దిల్‌రాజు. ఆయన మాత్రమే ‘గేమ్ ఛేంజర్’ గురించి చెబుతాడని తెలిపారు.
మొత్తం ఆయన చేతుల్లోనే ఉందని అన్నాడు. దీంతో గేమ్ చేంజర్ గురించి దిల్ రాజుకు కూడా ఏమి తెలియదా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు దిల్ రాజు అంటేనే సినిమాల విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు. అలాంటిది శంకర్ సినిమా అనగానే.. దిల్ రాజు చేతులెత్తేశాడనే చెప్పాలి. లేదంటే ఈపాటికి దిల్ రాజ్ ‘గేమ్ చేంజర్’ను ఏదో ఒకటి చేసేవాడేమో. కానీ అక్కడుంది శంకర్ కాబట్టి.. ఆయనే స్వయంగా అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.