రవితేజ డబుల్ డోస్ ‘ధమాకా’ మాస్ జాతర చూసి షాక్ అవుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. డిసెంబర్ 23న ఆడియెన్స్ ముందుకొచ్చిన ‘ధమాకా’ సినిమా.. రొటీన్ కథ, కథనం అనే టాక్ తెచ్చుకుంది. కానీ రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, భీమ్స్ సిసిరోలిమో మ్యూజిక్, హీరోయిన్ శ్రీలీల గ్లామర్.. ధమాకాకు మాసివ్ బ్లాక్ బస్టర్ అందించింది. దానికి తోడు క్రిస్మస్ హాలిడేస్ మరింతగా కలిసి రావడంతో.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది ధమాకా. డే వన్ 10 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. మొత్తంగా వరల్డ్ వైడ్గా ఐదు రోజుల్లో 49 కోట్లు రాబట్టి రవితేజ సత్తా ఏంటో చూపించింది. దాంతో మాస్ రాజా 50 కోట్ల క్లబ్లో చేరిపోయినట్టేనని చెప్పొచ్చు. అంతేకాదు.. రవితేజ కెరీర్లో అత్యంత వేగంగా 50కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా ధమాకా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ మధ్య వస్తున్న సినిమాలు వీకెండ్ వరకే భారీ వసూళ్లను అందుకుంటున్నాయి. కానీ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అందుకున్న ధమాకా.. సోమ, మంగళ వారాల్లోను భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ వీకెండ్లో మరో పెద్ద సినిమా లేకపోవడంతో.. రవితేజదే హవా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే లాంగ్ రన్లోను ధమాకా మరింత వసూళ్లను రాబట్టడం ఖాయమంటున్నారు. ఇక త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. ఏదేమైనా రవితేజ సాలిడ్ హిట్ కొట్టాడనే చెప్పొచ్చు.