మాస్ మహారాజా రవితేజ హీరోగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది ధమాకా మూవీ. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. రవితేజ కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ధమాకా 107 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. ఆ సక్సెస్‌ని ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంది ధమాకా టీమ్. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో.. ఎప్పటినుంచో అనుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పుడు వర్కౌట్ అయినట్టు తెలుస్తోంది. నాని ‘నేను లోకల్’.. రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాల తర్వాత.. విక్టరీ వెంకటేష్‌తో సినిమా ప్లాన్ చేశాడు నక్కిన. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం ధమాకా జోష్‌లో ఉన్న త్రినాథరావు.. రీసెంట్గా వెంకీని కలిసినట్టు తెలుస్తోంది. వెంకీకి ఒక స్టోరీ లైన్ చెప్పగా.. ఆ కథపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఎఫ్ 3 తర్వాత మరో కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు వెంకీ మామ. ప్రజెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో.. త్రినాధ రావుతో సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. పైగా త్రినాధరావుతో సినిమాలు చేసేందుకు కొన్ని బడా సంస్థలు రెడీగా ఉన్నాయి. అందులోభాగంగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. ఇప్పటికే అతనికి అడ్వాన్స్ ఇచ్చినట్టు టాక్. ఇక ఇప్పుడు వెంకటేష్ లాంటి స్టార్ హీరో త్రినాధరావుకి ఛాన్స్ ఇస్తే.. వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. ప్రస్తుతం వెంకటేష్ హిందీలో సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. మరి వెంకీతో త్రినాధరావు ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.