కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో మారి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బాలాజీ మోహన్ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు..నేను శైలజ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ్ మూవీస్‌లో సహాయ పాత్రలు పోషించిన నటి ధన్య బాలకృష్ణను..సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపించాయి..ఇదే విషయాన్ని తాజాగా నిర్ధారించాడు బాలాజీ మోహన్.. అంతేకాదు తన పర్సనల్ లైఫ్‌కు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు..టీవీ నటి కల్పికా గణేష్‌పై ఆయన పిటిషన్ దాఖలు చేశారు..
బాలాజీ పిటిషన్ విషయానికొస్తే..హౌ ఐ ఫాల్ ఇన్ లవ్,మారి, మారి2 చిత్రాలకు దర్శకత్వం వహించాడు..7 ఆం అరివు,రాజా రాణి వంటి చిత్రాల్లో నటించిన..ధన్య బాలకృష్ణతో గత జనవరి 23న వివాహం చేసుకున్నాడు..వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న తెలంగాణకు చెందిన నటి కల్పికా గణేష్ మా వివాహం, వ్యక్తిగత జీవితంపై పరువు నష్టం కలిగించేలా యూట్యూబ్‌లో వీడియోలను విడుదల చేసిందాని..ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది’ అని తెలిపారు..అంతేకాదు ఆమెను .. తమ పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా..నిషేధం విధించాలని పిటిషన్లో కోరారు..
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామ్మూర్తి..దర్శకుడు, ఆయన వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కల్పికా గణేష్‌ను ఆదేశిస్తూ..కేసును జనవరి 20కి వాయిదా వేశారు..ఇదిలా ఉంటే..దర్శకుడు బాలాజీ మోహన్ ముందుగా తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌నే వివాహం చేసుకున్నాడు..కానీ పెళ్లయిన ఏడాదికే విడిపోయారు..ప్రస్తుతం నటి ధన్య బాలకృష్ణతో రెండో వివాహం చేసుకున్నాడు..
అయితే, సరిదిద్దలేని విభేదాల కారణంగా తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు 2016లో బాలాజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ‘పరస్పర అంగీకారంతోనే ఇద్దరం అధికారికంగా విడాకులు తీసుకుంటున్నాం. ఇప్పటికే న్యాయపరమైన లాంఛనాలు పూర్తయ్యాయి. ఇది హెల్తీ సెపరేషన్, ఇకపై ఎవరి దారుల్లో వారు ముందుకు సాగుతాం. మీరు ఎల్లప్పుడూ నాకు అందించిన మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు అని సదరు పోస్టులో పేర్కొన్నారు.
ఇక ధన్య బాలకృష్ణ తమిళ్లో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో 2012లో వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ ఆమె మొదటి చిత్రం..ఆ తర్వాత ‘రన్ రాజా రన్, రాజుగారి గది, చిన్నదాన నీకోసం, భలే మంచిరోజు, జయ జానకి నాయక, సాఫ్ట్వేర్ సుధీర్’ తదితర చిత్రాల్లో కనిపించింది..