ఒకే ఒక్క సినిమా పెళ్లి సందDతో ఒక్కసారిగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ఇక ఆ తర్వాత చేసిన మాస్ మహారాజా ‘ధమాకా’ అమ్మడికి మాసివ్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. దాంతో శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. యంగ్ హీరోలే కాదు.. సీనియర్ హీరోలు కూడా ఈ బ్యూటీ వెంట పడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల హాట్ కేక్. అందుకే దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు. శ్రీలీల చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో అమ్మడి పేరు వినిపిస్తుండగా.. శర్వానంద్, వైష్ణవ్ తేజ్, నితిన్, రామ్ సినిమాల్లో మాత్రం ఫిక్స్ అయిపోయింది. అయితే తాజాగా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ పవన్ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టారు పవన్. అందులో సాహో డైరెక్టర్ సుజీత్ సినిమా కూడా ఉంది. ఇప్పటికే ఓజి అంటూ అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు. హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ పూర్తి అవగానే.. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్‌నే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. దాంతో హీరోయిన్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఈ సినిమాలో ధమాకా ముద్దుగుమ్మ శ్రీలీలా హీరోయిన్గా తీసుకున్నట్టు టాక్. ధమాకాలో రవితేజకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకోవడంతో.. పవన్‌కు సూపర్‌గా సెట్ అవుతుందని భావిస్తున్నారట. ఒకవేళ అమ్మడు ఈ ఆఫర్ నిజంగానే అందుకుంటే మాత్రం.. బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఏదేమైనా ప్రస్తుతం శ్రీలీల టైం నడుస్తోంది.