మహేష్ బాబు, రామ్ చరణ్‌తో వారసుడు సినిమాను చేయాలనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. కానీ వాళ్లు బిజిగా ఉండడం వల్ల.. కోలీవుడ్ హీరో విజయ్‌తో చేశామని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. కథలో కొత్తదనం లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో ఇలాంటి సినిమాలు బోలేడు ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకేనేమో మహేష్, చరణ్.. బిజీగా ఉన్నామంటూ.. సైడ్ అయ్యారా అనే డౌట్ క్రియేట్ అవుతోంది. పైగా దర్శకుడు వంశీ పైడిపల్లి.. బృందావనం, మహర్షి సినిమాలు చూసి ఉన్నారు. కాబట్టి వారసుడు కొత్తేం కాదు. అయితే ఇదంతా తెలుగు ఆడియెన్స్ వెర్షన్ మాత్రమే. తమిళ్ వాళ్లకు మాత్రం.. మాస్ ఇమేజ్ ఉన్న విజయ్‌ని కొత్తగా చూసినట్టు అనిపించక మానదు. అలాగే తెలుగు జనాలకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ హత్తుకునేలా ఉంటే.. సినిమాను గుండెకు హత్తుకుంటారు. కాబట్టి వారసుడు కథలో దమ్ముంటే.. టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకోవడం పక్కా అని చెప్పొచ్చు. అసలు వారిసు ట్రైలర్లో ఏముందనేది ఓ సారి చూస్తే! ముందు నుంచి ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ప్రచారం చేస్తున్నట్టుగానే ట్రైలర్లో అదే విషయాన్ని క్లియర్ కట్‌గా చూపించారు. జాయింట్ ఫ్యామిలీ నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని రూపొందించారు. ఈ కాలంలో కూడా ఉమ్మడి ఫ్యామిలీ ఉండటం గ్రేట్ సర్.. అంటూ ఒకే ఒక్క డైలాగ్‌తో సినిమా కాన్సెప్ట్ చెప్పేశారు. తల్లిగా జయసుధ, తండ్రిగా శరత్ కుమార్ కనిపించారు. ఈ బిజినెస్ మెన్ కపుల్స్‌కి ముగ్గురు కొడుకులు.. వాళ్లే శ్రీకాంత్, శ్యామ్, హీరో విజయ్. ఈ ఫ్యామిలీకి ప్రకాష్ రాజ్ లాంటి విలన్ ఎదురుపడితే.. చిన్నవాడైన వారసుడు విజయ్ ఏం చేశాడు? విడిపోయిన ఫ్యామిలీ ఎలా ఒక్కటయింది? అనేదే ఈ సినిమా మెయిన్ కథ. అయితే విజయ్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ హైలెట్‌గా ట్రైలర్ కట్ చేశారు. తెలుగులో ఇలాంటి కథలు.. అది కూడా దిల్ రాజు బ్యానర్లో వచ్చిన సినిమాలున్నాయి. కాబట్టి వారసుడు.. వీరసింహారెడ్డికి, వాల్తేరు వీరయ్యకు పెద్ద పోటీ కాదని తేల్చేస్తున్నారు నెటిజన్స్. మరి తెలుగులో కాకుండా.. తమిళ్లో వారసుడు సత్తా చాటుతాడేమో చూడాలి.