ఇన్ని రోజులు అజిత్‌ను తక్కువ చేస్తు.. విజయ్ ఫ్యాన్స్‌ను ఊరిస్తూ వచ్చాడు నిర్మాత దిల్ రాజు. కానీ వారసుడు సినిమా ట్రైలర్ చూసి సదరు నెటిజన్స్‌తో పాటు.. దళపతి ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. వారసుడు ట్రైలర్ చూసి.. ఇదో రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తేల్చేశారు. అంతేకాదు సినిమా రిజల్ట్‌ను కూడా ముందే అంచనా వేస్తున్నారు. ఇక వారిసు ట్రైలర్ అయితే ట్రోలర్స్ స్టఫ్‌గా మారిపోయింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. ఇప్పటికే తెలుగులో వచ్చిన ఫ్యామిలీ సినిమాలన్నింటిని కలిపి వారసుడు తీశాడని కామెంట్ చేస్తున్నారు. శ్రీమంతుడు, అజ్ఞాతవాసి, మహర్షి, అలవైకుంఠపురంలో, బ్రహ్మోత్సవం సినిమాలు కలిస్తే.. కొత్త వారసుడు వచ్చాడని అంటున్నారు. ఇదిలా ఉండగానే.. అజిత్ ఫ్యాన్స్‌తో కయ్యానికి కాలు దువ్వేలా చేశాడు దిల్ రాజు. అసలే విజయ్, అజిత్ ఫ్యాన్స్‌కు పడదు. అలాంటిది తునివు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత.. వారిసు కూడా జనవరి 11న వస్తున్నట్టు ప్రకటించాడు దిల్ రాజు. ముందు నుంచి జనవరి 12 వారిసు రానుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అజిత్‌తో పోటీగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ హీరోల ఫ్యాన్స్ హంగామా తక్కువే అయినా.. తమిళ తంబీలు మాత్రం కొట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఏ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా.. యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్, ట్రోలింగ్ తట్టుకోవడం మేకర్స్‌కు కష్టమనే చెప్పొచ్చు. అయితే వారసుడు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా.. తునివు మాత్రం యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉంది. కాబట్టి రెండు సినిమాల రిజల్ట్స్‌ను ఇప్పుడే అంచనా వేయలేం. మరి వారసుడు, తెగింపు ఏం చేస్తాయో చూడాలి.