విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎప్పుడూ హాట్ టాపికే. ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నారంటూ.. ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరు ఎవరి పనిలో వారున్నారు. కానీ న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయారు. గత రెండు మూడు రోజులుగా ఈ ఇద్దరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇద్దరు షేర్ చేసిన స్విమ్మింగ్ ఫూల్ ఫోటోలు ఒకే లొకేషన్‌కు సంబంధించినవని.. ఇద్దరూ వేర్వేరుగా ఉన్న ఫోటోలను కలిపి ఓ ఫోటోని వైరల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ వీడియోలోని ఆడియో క్లిప్ మరింత వైరల్‌గా మారింది. రష్మిక తన ఫాలోవర్లతో సోషల్ మీడియా ఇంటరాక్షన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో రష్మిక తన ఏజ్ గురించి చెప్పుకొచ్చింది. కానీ బ్యాక్ గ్రౌండ్లో వినిపించి వినిపించనట్టుగా.. ఓ మేల్ వాయిస్ వినిపించింది. దాంతో ఆ వీడియోలో ఉన్నది విజయ్ దేవరకొండ వాయిస్ అనే ప్రచారం ఊపందుకుంది. దానికి తోడు కొన్ని పెద్ద పెద్ద ఛానెల్స్ సైతం.. దాచినా దాగని ప్రేమ.. సాక్ష్యాలతో సహా దొరికిపోయారని.. యూట్యూబ్‌లో లైవ్ ప్రసారం చేస్తున్నారు. దాంతో నెటిజన్స్ కూడా ఇద్దరు ఒకే చోట ఉన్నట్టు.. కలిసే న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నట్టు ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు ఇందులో నిజముందా.. అంటే ఖచ్చితంగా కాదనలేం. ఎందుకంటే ఇంత జరుగుతున్నా.. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ స్పందించడం లేదు. కాబట్టి ఇద్దరు డేటింగ్లో ఉన్నట్టేనని అంటున్నారు. మరి ఇప్పటికైనా దీని పై స్పిందిస్తారేమో చూడాలి.