»Vikramaditya Rajanandini Exclusive Interview Fathers Day Special Hit Tv Telugu
Vikramaditya: శ్రీవాణి నాకంటే ఏడేళ్లు చిన్నది..కానీ లవ్ మాత్రం
ఆట డాన్సర్, కొరియోగ్రఫర్ విక్రమ్ ఆదిత్య(Vikramaditya), తన కుమార్తె రాజనందిని(Rajanandini)తో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం. ఈ ఇంటర్వ్యూలో తన లవ్ మ్యారేజ్ గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆట డాన్సర్, కొరియోగ్రఫర్ విక్రమ్ ఆదిత్య తన పెళ్లి గురించి కీలక విషయాలను ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతోపాటు తన కుమార్తె రాజనందినికి ఆ పేరు పెట్టడానికి గల కారణాలను తెలిపారు. అంతేకాదు ఇటీవల షిరిడి వెళ్లినా కూడా నందిని వాళ్ల పేరెంట్స్ అని పలువురు అడిగినట్లు చెప్పారు. తన కుమార్తె డాన్స్ ఫర్మామెన్స్ కారణంగా ఇన్ స్టాగ్రాంలో ఎక్కువ మంది పాలోవర్లను సంపాదించుకున్నట్లు తెలిపారు.
దీంతోపాటు తన లవ్ మ్యారేజ్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. 2001లో శ్రీవాణితో తన జర్నీ ప్రారంభమైందని గుర్తు చేశారు. శ్రీవాణి తన కంటే ఏడేళ్లు చిన్నదని అన్నారు. త్యాగరాయ సభలో డాన్స్ కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఆమె పరిచయమైందని..ఆ తర్వాత ఆరేళ్ల తర్వాత తనపై ప్రేమ కలిగినట్లు వెల్లడించారు. ఆ తర్వాత శ్రీవాణిని మొదట యాంకర్ గా ట్రై చేయమని ఈటీవీకి తీసుకెళ్లగా..అక్కడ సెలక్ట్ కావడంతో తన లైఫ్ మారిపోయిందని చెప్పారు. ప్రేమ విషయంలో మాత్రం తనే ఫస్ట్ ప్రపోజ్ చేసినట్లు విక్రమ్ ఆదిత్య వెల్లడించారు. ఇంకా ఏం చెప్పారో తెలియాలంటే మాత్రం పూర్తి ఇంటర్వ్యూ వీడియో చూడాల్సిందే.