»Sai Chand Wife Veda Rajini Exclusive Interview Hit Tv Official
Exclusive Interview: నా భర్త ఆశయాలను వదిలేస్తే నా బ్రతుక్కి అర్థం లేదు
తన పాటతో, మాటతో అందరి మనుసులను గెలిచిన దివంగత కళకారుడు, రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడు సాయి చంద్ భార్య వేద రజని హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సాయి చంద్ ఆశయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
Sai Chand Wife Veda Rajini Exclusive Interview Hit TV Official
Exclusive Interview: తెలంగాణ ఉద్యమం నుంచి ఒక్కో మెట్టు కట్టుకొని, తన పాటతో మాటతో ప్రజల హృదయాలను చురగొనడమే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశిస్సులతో, ప్రజలు ఏదైనా చేయాలి అనే ఆశయంతో రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మెన్ గా సాయిచంద్ పదవిని స్వీకరించారని, ఆయన మరణించిన తరువాత అదే పదవిలో సాయి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రజా జీవితంలో ఉన్నట్లు వేద రజని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు వలసలు ఆగాయని, రాష్ట్రంలో ఎక్కడ చూసిన అభివృద్ధి కనిపిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాయి అని, అలా విమర్శించడం కూడా మంచిదే అని అన్నారు. సాయి చంద్ తనతో ఉండి నడిపిస్తున్నారని, ఆయన లేని లోటును ఫీల్ కాను అని వెల్లడించారు. సాయి చంద్ ఆశయాలు ఏంటి.? ఆయనతో జీవితం పంచుకున్న రజని ఏం నేర్చుకున్నారు.? సమాజానికి సాయి చంద్ ఏం చెద్దామనుకున్నారు.? వాటిని రజిని ఎలా నెరవేర్చాలనుకుంటున్నారు అనే విషయాన్ని హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియోను చూసేయండి.