ELR: నూజివీడు ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి సాధిస్తేనే రాష్ట్రం, దేశం శరవేగంగా పురోభివృద్ధి వైపు అడుగులు వేస్తాయన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధిగా విజయపథం వైపు పయనించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వేసవి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.