Child artist Bhanu Prakash said what he does with hero Yash in his spare time
Bhanu Prakash: కేజీఎఫ్(KGF) చిత్రంతో అందరికి సుపరిచితుడు అయిన చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రకాశ్(Bhanu Prakash) తనకు సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలిపారు. సినిమాల్లో నటించడం కోసం తాను ఎంతలా కష్టపడుతాడో చెప్పాడు. ఇక రీసెంట్ గా విడుదలైన విమానం(Vimana) చిత్రం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీతో పంచుకున్నారు. ఇక తనకు మొదటి సినిమా ఛాన్స్ గురించి మాట్లాడుతూ.. తనకు ఊహ తెలియనప్పుడే అల్లు శిరిష్ నటించిన ఒక్క క్షణం సినిమాలో యాక్టింగ్ చేసినట్లు… షూటింగ్ లు ఉన్నప్పుడు వాళ్ల నాన్నే అన్ని చూసుకుంటాడని వివరించాడు. ఇక కేజీఎఫ్ షూటింగ్ ముగిసిన తరువాత ప్రతీ సీన్ గురించి వాళ్ల అమ్మకు చెప్పేవాడినని తెలిపాడు. ప్రతీ రోజు లెజెండ్ సినిమాను ఎందుకు చూసేవాడో భాను ప్రకాశ్ చెప్పాడు. ఇక తన చదువు గురించి, లోకేషన్స్ లో ఎలా చదువుకుంటాడో లాంటి అనేక ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. భాను ప్రకాశ్ చెప్పిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను చూడాల్సిందే.