సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 14న గోదా శ్రీనివాస కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు. మంగళవారం కల్యాణోత్సవ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. 1200 జంటలు పాల్గొనే ఈ వేడుకకు పక్కా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.