Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చదవగలరు.
మేష రాశి: ఫారిన్ వెళ్లేందుకు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడుతుంది. అనారోగ్య బాధలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం అధిగమిస్తారు. ప్రముఖ వ్యక్తులను కలుస్తారు.
వృషభ రాశి: వ్యవసాయరంగంలో ఉన్న వారికి లాభం ఉంటుంది. తొందరపాటు వల్ల పనులకు ఆటంకం ఏర్పడుతుంది. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆందోళన చెందుతారు. శారీరకంగా బలహీనంగా ఉంటారు.
మిథున రాశి: మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సక్సెస్ అవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి: విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
సింహ రాశి: మీ ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
కన్య రాశి: రుణ ప్రయత్నాలు ఈజీగా సక్సెస్ అవుతాయి. కానీ కుటుంబంలో అనారోగ్య బాధలు తప్పవు. బంధు, మిత్రులతో వైరం ఉండకుండా జాగ్రత్త పడటం మంచిది. ఇతర వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
తుల రాశి: ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళ దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
ధనుస్సు రాశి: అనారోగ్య బాధలు అధికం అవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసర భయానికి లోనవుతారు. వ్యాపారరంగానికి చెందినవారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు.
మకర రాశి: గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.
కుంభ రాశి: భోజనాల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. భావోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. కొత్త పనులు ప్రారంభించవద్దు.
మీన రాశి: అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు తప్పవు. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.