ఈ రోజు అష్టమి కావడంతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రాశుల వారు శత్రువుల నుంచి దూరంగా ఉండడం చాలా మేలు చేస్తుంది. మరికొన్ని రాశుల వారికి విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి.
శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం అష్టమి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి శుక్రవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: ఈ రోజు శుభం కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువుల నుంచి దూరంగా ఉండాలి. గణపతిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.
వృషభం:శత్రుబాధలు తొలగిపోతాయి. గౌరవ మర్యాదలు దక్కుతాయి. వృత్తి, వ్యక్తిగతంగా అభివృద్ధి పొందుతారు. ఎవరితోనూ విభేదించకండి. దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీరామ నామస్మరణ చేయాలి.
మిథునం: కుటుంబపరంగా పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. అసంపూర్తి పనులు పూర్తవుతాయి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలను పఠించాలి.
కర్కాటకం:ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. అనారోగ్యం కొంత కలవరపరుస్తుంది. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. రుణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి.
సింహం:నమ్మిన వారి నుంచే మోసపోయే ప్రమాదం పొంచి ఉంది. కొత్త పనులు చేపట్టకూడదు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుంది.
కన్య:దగ్గరి వారితో వివాదం ఏర్పడే ప్రమాదం ఉంది. వృత్తిరీత్యా స్థానచలనం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన సమయాల్లో ఇతరుల నుంచి సహాయం లభిస్తుంది. శ్రీవిష్ణువుని దర్శించుకోవాలి.
తుల:ఏకాగ్రతతో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. శత్రువులపై విజయం సాధించాలని ప్రయత్నించకూడదు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. శివుడి ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది.
వృశ్చికం: మానసిక ఆందోళనతో బాధపడుతారు. ఆకస్మిక ధన నష్టం కలిగే ప్రమాదం ఉంది. కుటుంబంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. హనుమాన్ చాలీసా పఠించాలి.
ధనుస్సు: మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. బంధుమిత్రుల నుంచి గౌరవం లభిస్తుంది. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. మీ అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలకు ఫలితాలు లభిస్తాయి. దుర్గ ఆరాధన చేయాలి.
మకరం:వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. కుటుంబంలో మార్పులు జరగవచ్చు. ఏమరుపాటుగా ఉండాలి. సత్కర్యాలు చేస్తారు. ప్రణాళికలకు అనుగుణంగా సాగండి. గోవిందనామస్మరణ చేయాలి.
కుంభం: ధర్మ కార్యాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మానసిక ఆనందంతో ఉంటారు. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుంది. కానీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. సూర్య ధ్యానం చేయాలి.
మీనం: ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. అనవసరమైన భయాందోళనలు మాత్రం తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితిలో ఒడిదొడుకులు ఉంటాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.