Horoscope శుభం భుయత్.. ఈ రాశుల వారికి నేడు శుభాలే..
మంగళవారం మంగళకరమైన రోజు.. ఈ రోజు చాలా మంది రాశుల వారికి శుభం జరుగుతుంది. కాకపోతే కొంత జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజును అద్భుతంగా పూర్తి చేసుకోవచ్చు.. అవేంటో తెలుసుకోండి..
శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం పంచమి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి మంగళవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం:చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.
వృషభం:వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఇతరులకు ఇబ్బందులకు గురి చేసేలా ప్రవర్తించకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యం కోల్పోవద్దు. శత్రువుల విషయంలో ఏమరుపాటుగా ఉండొద్దు. దైవరాధన తప్పనిసరిగా చేయాలి.
మిథునం: శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా సంతోషంగా గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక విషయంలో చేసే ప్రయత్నాలు లాభాలు కలిగిస్తాయి. శని శ్లోకాన్ని పఠించాలి.
కర్కాటకం: అవాంతరాలు ఎదురై ఆగిపోయిన శుభకార్యాలు ముందుకు కదులుతాయి. చేసే పని ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. శివ ఆరాధన చేయాలి.
సింహం: కొన్ని రంగాల్లో ఉన్నవారికి మానసిక ఆందోళన కలుగుతుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గణపతి ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది.
కన్య: శుభవార్తలు వింటారు. సమయపాలన పాటించి మనోధైర్యం కోల్పోవద్దు. కొత్తగా చేపట్టే పనులకు అవాంతరాలు ఎదురవుతాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. విష్ణు ఆలయాన్ని దర్శించుకోవాలి.
తుల: బుద్ధిబలంగా ఆటంకాలు ఎదురైన అంశాల్లో విజయాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. డబ్బును పొదుపుగా వాడాలి. ఇష్టదైవాన్ని దర్శించుకోవాలి.
వృశ్చికం: మీ ఆరోగ్యం సహకరిస్తుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. రామ నామస్మరణ చేయాలి.
ధనుస్సు:వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గౌరవం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టిన కార్యాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కనకధార స్తోత్రం పఠించాలి.
మకరం:మానిసకంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇతరులకు సహాయం చేయడానికి వెళ్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. దుర్గా స్తుతి పఠించాలి.
కుంభం:కొంత మానసిక ఆందోళనకు లోనవుతారు. బంధు, మిత్ర విరోధం ఏర్పడే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు పాటించాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు. కాలం కలిసి రాదు. హనుమాన్ చాలీసా పఠించాలి.
మీనం: కొత్త పనులు చేపట్టడానికి ఇది సమయం కాదు. ఇంట్లో జరిగే విషయాలు ఆందోళన కలిగిస్తాయి. బంధుమిత్రులతో అప్రమత్తంగా ఉండాలి. మరికొన్ని విషయాలు మీ మనోధైర్యాన్ని పెంపొదిస్తుంది. దైవరాధన మాత్రం మరచిపోవద్దు.