Horoscope నేటి రాశి ఫలాలు.. ఇష్ట దైవారాధన చేస్తే మేలు
ఈ రోజు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుండగా.. మరికొందరికి మిశ్రమ ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాల్లో ఒక రాశి వారికి అందమైన శుభవార్త వింటారు.
శోభకృత్ నామ సంవత్సరం చైత్ర మాసం త్రయోదశి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి మంగళవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం:కీలకమైన విషయాల్లో పెద్దల సలహాలు పొందాలి. శత్రువుల జోలికి, మీకు చేటు చేసే వారికి వెళ్లకపోవడం మంచిది. ఒక వార్త మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చంద్ర ధ్యానం చేయాలి.
వృషభం: పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీకు సానుకూల ఫలితాలు దక్కుతాయి. ధనలాభం ఉంది. ముఖ్య విషయాల్లో సొంతంగా తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. హనుమాన్ చాలీసా పఠనం చేయాలి.
మిథునం: మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. మీ ఉద్యోగ విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కీలక సమయాల్లో మీకు సహాయం లభిస్తుంది. శ్రీవిష్ణు సందర్శనం చేస్తే మేలు జరుగుతుంది.
కర్కాటకం: మన:శ్శాంతి లభిస్తుంది. అతి కీలకమైన నిర్ణయాల విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. ధైర్యం కోల్పోవద్దు. మానసికంగా ధైర్యంగా ఉండాలి. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి.
సింహం: ఉద్యోగంలో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబసభ్యుల అండ ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అష్టమచంద్ర సంచారం వీరికి అనుకూలంగా లేదు. దుర్గామాత శ్లోకాలు పారాయణం చేయాలి.
కన్య: ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి.
తుల: ప్రశాంతంగా ఆలోచించాలి. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. కుటుంబసభ్యుల సలహాలు పొందాలి. శారీరక శ్రమ కొంత పెరుగుతుంది. శివుడి ఆరాధన చేయాలి.
వృశ్చికం: దుందుడుకు స్వభావంతో ఆటంకాలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చేయని తప్పునకు నిందలు పడే ప్రమాదం ఉంది. మీ భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు ఫలితాలు లభిస్తాయి. దుర్గ ఆరాధన చేయాలి.
ధనుస్సు: మీ పని విషయంలో ప్రశంసలు దక్కుతాయి. ఎవరితోనూ భేదాభిప్రాయాలకు వెళ్లవద్దు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రామ నామస్మరణ చేయాలి.
మకరం:సత్కర్యాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ విషయంలో సానుకూల ప్రభావం ఉంటుంది. మీ మీకు ప్రశంసలు దక్కుతాయి.. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు వెళ్లండి. ఆలోచించి తీసుకునే స్థిర నిర్ణయాలు విజయాలను అందిస్తాయి. గోవింద నామస్మరణ చేయండి.
కుంభం:మంచి మనసుతో చేసే పనులు అద్భుత ఫలితాలను ఇస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది గుర్తుంచుకుని ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
మీనం: ఈ రాశికి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి సంబంధ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వాటిని సమర్ధంగా ఎదుర్కొంటారు. ప్రయాణాలు మేలు చేస్తాయి. సూర్య ధ్యానం మేలు చేస్తుంది.