శోభకృత్ నామ సంవత్సరం చైత్ర మాసం ద్వాదశి ఈ రోజు. ఈ రోజు ఏ రాశి వారికి కలిసి వస్తుంది? ఏ రాశి వారికి సోమవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు (Horoscope) ఇలా ఉన్నాయి.
మేషం: ఓ శుభవార్త వింటారు. అది వృత్తి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధికి సంబంధించిన వార్త అయ్యి ఉంటుంది. మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, దైవ బలం విశేషంగా ఉంది. ఈ రోజు వేంకటేశ్వర స్వామిని దర్శించాలి.
వృషభం: చేసే పనుల్లో శ్రమకు లోనవుతారు. వృత్తి, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలరు. వేంకటేశ్వర స్వామిని పూజించాలి.
మిథునం:మీ పని తీరు పట్ల ప్రశంసలు దక్కుతాయి. కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మహాలక్ష్మి అష్టోత్తరం పఠనం చేయాలి.
కర్కాటకం: చేసే పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. అయినా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సంకల్ప బలం మీకు విజయం చేకూరుస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని వెనక్కి లాగినా.. కొన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ చేయాలి.
సింహం:మీ ప్రతిభకు, పనితీరు పట్ల గుర్తింపు లభిస్తుంది. ఓ శుభవార్త మీ కుటుంబంలో ఆనందం నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక విషయాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
కన్య: అధిక సమయం మీ అభివృద్ధి కోసం వెచ్చించాలి. అపూర్వ విజయాలు దక్కుతాయి. అందరి నుంచి మెప్పు పొందుతారు. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గా ధ్యానం చేయాలి.
తుల: వీరికి ఈ రోజు కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీకు సంబంధం లేని విషయాల్లో మీపై ఆరోపణలు రావొచ్చు. బంధుమిత్రులతో స్పష్టంగా ఉండాలి. ఇష్టదైవ స్తోత్రం పఠించాలి.
వృశ్చికం: దీర్ఘకాలిక సమస్య విషయంలో ఈ రోజు సానుకూల ఫలితం ఉంటుంది. ఆత్మీయులు ఇచ్చే సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ పనితనానికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. విష్ణు సహస్ర నామావళి పఠించాలి.
ధనుస్సు: వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. ఈ రాశివారు నేడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.
మకరం: కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు ఆలస్యమవుతాయి. పెద్దలతో కొంత అణకువగా ఉండాలి. వారితో అనుబంధం జాగ్రత్తగా ఉండాలి. శివనామ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి.
కుంభం: ప్రశంసలు దక్కే పనులు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో సత్ఫలితాలు పొందరుతారు. వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఆంజనేయస్వామిని ఆరాధించాలి.
మీనం: చేసే పనుల్లో మాసికంగా ధృడంగా ఉండాలి. ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు. కానీ వాటి అమలు విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.