శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం ఏకాదశి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి సోమవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: కుటుంబంలో మార్పులు జరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని పరిస్థితులు మానసిక ఆందోళనను కలిగిస్తాయి. కుటుంబంలో శుభవార్త వింటారు. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. సూర్య గ్రహ ధ్యానం చేయాలి.
వృషభం: మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. ఇతరులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రంగం లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక భయం, ఆందోళన చుట్టుముడుతాయి. సూర్య భగవానుడిని ఆరాధన చేయాలి.
మిథునం: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మేలైన ఫలితాలు వస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో వాగ్వాదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రయత్న కార్యాలు కొంత ఆలస్యంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. చంద్ర శ్లోకం పఠించాలి.
కర్కాటకం: మనసును ప్రశాంతంగా ఉంచి పనులు చేయాలి. నిర్ణయాలు తీసుకోవడంలో తత్తరపడుతారు. మానసిక ఆందోళన కలుగుతుంది. విందు, వినోదాలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో మార్పులు జరుగుతాయి. వేంకటేశ్వరుడిని పూజించాలి.
సింహం: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. శివుడిని దర్శించుకోవాలి.
కన్య:ఏకాగ్రతతో పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త పనులు చేపట్టరాదు. ఆత్మీయుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆంజనేయస్వామిని ఆరాధించాలి.
తుల: మీరు చేపట్టే పనుల్లో అద్భుతాలు సాధిస్తారు. మానసిక సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు సహాయపడుతారు. విష్ణు సహస్ర నామాలు పఠించాలి.
వృశ్చికం: మీకు బంధువుల సహకారం లభిస్తుంది. కుటుంబంతో చర్చలు జరిపి పనులు చేపట్టాలి. దైవ దర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మీ సహస్ర నాయమం చదవాలి.
ధనుస్సు: ముఖ్యమైన విషయాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి. ఆటంకాలు ఎదురైనా ధృడ సంకల్పంతో ముందుకు వెళ్లాలి. శ్రమ పెరుగుతుంది. వాగ్వాదాలు, గొడవలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాల్లో భయాందోళన చెందుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి.
మకరం: ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచే పనులు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. సూర్య నారాయణమూర్తిని ఆరాధించాలి.
కుంభం:ఈ రోజు అనుకూల పవనాలు ఉన్నాయి. కీలక సమస్యలను పరిష్కరించుకుని అందరి ప్రశంసలు పొందుతారు. కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. కొత్త పనులు ప్రారంభించరాదు. ప్రయాణాలు లాభం చేకూరుస్తాయి. గణపతి ఆరాధన చేయాలి.
మీనం: సత్కార్యాలు చేయడంతో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన అంశాల్లో వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లండి. కలహాలకు దూరంగా ఉండండి. స్థిరమైన నిర్ణయాలకు విజయాలు దక్కుతాయి. గోవింద నామాలు చదవండి.