పట్టాభిషేకాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంది.
శ్రీరామనవమి (Sri Rama Navami) వేడుకలకు తెలంగాణలోని భద్రాచలంలో (Bhadrachalam Sree Seetha Ramachandra Swamy Temple) ప్రసిద్ధి పొందాయి. రెండో అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో (Bhadrachalam) శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి పురస్కరించుకుని గురువారం కల్యాణం వైభవోపేతంగా జరగ్గా.. శుక్రవారం శ్రీరాముడి పట్టాభిషేకం నేత్రపర్వంగా సాగింది. అనంతరం ఆవాహన పూజలు చేశారు. దేశంలోని 12 నదుల నుంచి తీసుకొచ్చిన జలాలను అభిషేకం చేశారు. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) పట్టువస్త్రాలు తీసుకురాగా.. తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, త్రిదండి దేవనాథ జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు.