ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలొచ్చారు. భక్తులతో కంపార్టు మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి (Sarvadarsananiki) సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 86,781 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.44,920 మంది తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు.
నిన్న శ్రీవారికి రూ.3.37కోట్ల హుండీ ఆదాయం (Hundi income) వచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 10 నుంచి 12వ తేదీ వరకు తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం (staircase ceremony) జరగనుంది. ఈ మూడు రోజుల పాటు ఉదయం భజన మండళ్లతో సుప్రభాతం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం సంగీత విభావరి, ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. జూలై 10న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు.