»Horoscope Today Todays Horoscope 2024 February 10th
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 February 10th).. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ రోజు(2024 February 10th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
అవసరమైన రుణం సన్నిహితుల నుంచి లభిస్తుంది. అనుకోని ప్రయాణాలు ఉన్నాయి. ఖర్చు పెరుగుతుంది. సమాయపాలన పాటించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడటం అవసరం.
వృషభం
శుభకార్యం జరుగుతుంది. దూర బంధువులతో ఆప్యాయంగా గడుపుతారు. మీమీ రంగాల్లో ఉన్నతిని సాధిస్తారు. విదేశయాన ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
మిథునం
సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధ అధికం అవుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కర్కాటకం
మానసికంగా ఆనందంగా గడుపుతారు. వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీమీ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సింహం
అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమపాలను భోజనం చేయాలి. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆలోచించి పనులు చేయాలి.
కన్య
బంధువులు, సన్నిహితులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ పనులు చేపడుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
తుల
ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
వృశ్చికం
శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం మంచిది.
ధనుస్సు
ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీమీ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
మకరం
విరోధం వలన స్నేహితులు దూరం అవుతారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు.
కుంభం
ఆస్తి విషయంలో వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతనవ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతనకార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.
మీనం
ఇతరులు గౌరవిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.