తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటను రిలీజ్ చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఫిబ్రవరి నెలోని 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ తేదీలకు సంబంధించిన ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లు ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలనుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని టీటీడీ పేర్కొంది.
అనంతరం ఈ టికెట్లను లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించనున్నారు. అలాగే అదే తేదిల ఆర్జిత సేవా టిక్కెట్లు ఈనెల 08 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు.వీటితో పాటు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను ఈనెల 09వ తేదీ ఉదయం 10 గంటలనుంచి ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. . భక్తులు ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.