ఈ రోజుల్లో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. వాస్తు శాస్త్రానికి అమితమైన శక్తి ఉంది. మన ఇంట్లో చేసేటటువంటి అన్ని పనులకు, మంచి చెడులకు వాస్తు శాస్త్రం ఎంతో ముఖ్యమైనది. ఇంటి నిర్మాణం నుంచి మన ఇంట్లో మనం అమర్చే వస్తువుల వరకూ అంతా కూడా వాస్తు శాస్త్రం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఏ దిశలో కూర్చోవాలి, ఏ దిక్కున కూర్చోని తినాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది. కొంత మంది అవగాహన లేకపోవడం వల్ల, వాస్తు శాస్త్రం గురించి సరిగా పట్టించుకోకపోవడం వల్ల పలు రకాల తప్పులు చేస్తూ ఉంటారు. మనం ఆ సమయంలో చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనం చేసే ఆ తప్పులేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారంగా దక్షిణ దిక్కుగా ముఖం పెట్టి భోజనం తినకూడదు. దక్షిణ దిక్కును చూస్తూ ఆహారాన్ని తింటే ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. దక్షిణ దిక్కును యమ దిశగా చూస్తారు కాబట్టి ఆ దిక్కున కూర్చోని భోజనం చేయడం వల్ల ఆయుష్షు తగ్గిపోనుంది. అంతేకాదు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఆ దక్షిణ దిక్కుగా కూర్చోని భోజనం చేయకండి.
ఇకపోతే మంచం మీద కూర్చుని తింటే ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మంచంపై కూర్చోని తినడం వల్ల ఖర్చులు పెరిగి అప్పులు పాలయ్యే అవకాశం ఉందని, అందుకే మంచంపై కూర్చోని భోజనం చేయకూడదని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.
ఉత్తరం – తూర్పు వైపు దిశలలో కూర్చోని భోజనం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఉత్తర, తూర్పు దిక్కులు రెండూ భగవంతుని దిక్కుగా చూస్తారు. ఈ దిశల్లో ఆహారం తీసుకుంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్టవేస్తుందని, అనేక ఒత్తిళ్ల నుంచి ఆ ఇంటివారు ఉపశమనం పొందుతారని వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా తూర్పు దిక్కుగా కూర్చోని ఆహారం తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడి, వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.