AP: తిరుమలలో అక్టోబర్ 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. దుర్గా నవరాత్రుల వేళ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయశుద్ధి కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.