టాలీవుడ్(Tollywood)లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఎన్ఎస్సార్ ప్రసాద్ (NSR Prasad) కన్నుమూశారు . కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. సీతారామ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన ‘నిరీక్షణ”(Niriksana) తో దర్శకుడిగా మారారు. శత్రువు, నటుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘రెక్కి”(Rekki) విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాంత్తో ‘శత్రువు’, నవదీప్తో ‘నటుడు’ అనే చిత్రాలను తెరకెక్కించాడు. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేశాడు. సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం.