అత్తా కోడళ్ల గొడవ ఏ ఇంట్లో అయినా సహజమే. వారు అప్పుడే కలిసి ఉంటారు. అప్పుడే గొడవ పడుతుంటారు. మహబూబాబాద్ జిల్లాలో అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది. మధ్యలో భర్త ఇన్వాల్వ్ అవడంతో చిన్న గొడవ కాస్త రచ్చ రచ్చ అయ్యింది. మహేందర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి వేంనూరు గ్రామంలో ఉంటున్నారు. ఇటీవల అతని భార్య టమాట కూర చేసింది. ఆ కూర అత్తకు నచ్చలేదు. ఇంకేముంది గొడవకు దారితీసింది.
టమాట కూర బాగా వండలేదని అత్త కోడలిని కామెంట్ చేసింది. ఈ విషయం కాస్త ఆ కోడలు భర్త అయిన మహేందర్ తో చెప్పింది. అత్త అన్న మాటలతో పాటు నాలుగైదు ఎక్కువే చెప్పేసరికి.. కోపంతో ఊగిపోయిన మహేందర్ పక్కనే ఉన్న కత్తి తీసుకొని తల్లిపైకి విసిరాడు. అది గట్టిగా తగలడంతో తీవ్ర గాయమై.. రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు దవాఖానాకు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.