Ronak Bharat వీడు మాములోడు కాదు.. జాబ్స్ పేరుతో మోసం
ఉద్యోగం, వ్యాపారం, స్టాక్ మార్కెట్లో షేర్లు అంటూ అమాయకులను మోసం చేశాడు సైబర్ మోసగాడు రోనాక్ భరత్. అలా రూ.500 కోట్లు వసూల్ చేసిన విషయం సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది.
Cyber Cheater Ronak Bharat: సైబర్ నేరగాళ్లు రూటు మారుస్తున్నారు. నయా పంథాలో దూసుకెళ్తున్నారు. కొత్తగా ఉద్యోగం, వ్యాపారం పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. షేర్ మార్కెట్లో కాల్స్ పేరుతో ఊరించి.. వంచిస్తున్నారు. రోనాక్ భరత్ (Ronak Bharat) అనే సైబర్ ఛీటర్ లీలలు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చాయి. ఇలా అన్నీ రంగాల్లో రాటుదేలాడు. అలా ఓ టీమ్ ఏర్పాటు చేశాడు. అందులో యాప్ డెవలపర్లు, సోషల్ మీడియా మేనేజర్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఉన్నారు. అమాయకులకు ఫోన్ చేసి.. వీక్ నెస్ పాయింట్ తెలుసుకుంటారు.
డేటా సేకరించి..
జాబ్ చేసే వారి డేటాను సోషల్ మీడియా నుంచి సేకరిస్తారు. టెలిగ్రామ్ (telegram) చానెల్స్‌లో యాడ్ చేస్తాడు. అందులో జనం వెతికే అంశాలను.. తాము అందజేస్తామని చెబుతారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫేక్ లింక్స్ పంపి.. మోసానికి తెరలేపుతాడు. ఒక్కొక్కరి నుంచి ఒకలా రూ. వేలు, రూ. లక్షలు వసూల్ చేస్తాడు. దేశవ్యాప్తంగా రొనాక్ టీమ్ కోట్ల రూపాయలు దండుకుంది. ఇప్పటివరకు లక్షమందికి పైగా మోసం చేశారని.. అలా వారి నుంచి రూ.500 కోట్లు కొల్లగొట్టారని సీసీఎస్ పోలీసులు తెలిపారు.
కేసు విచారిస్తోన్న కొద్దీ బాధితులు బయటకు వస్తున్నారని చెబుతున్నారు. కొన్ని కంపెనీలను డార్క్ వెబ్ ద్వారా రోనాక్ (Ronak) మోసం చేశాడని వివరించారు. నకిలీ ఈ-మెయిల్స్ క్రియేట్ చేసి.. ఇతర దేశాల సంస్థలతో వ్యాపార ఒప్పందాలు ఉన్న దేశీయ సంస్థలను మోసం చేశాడని తెలిపారు. ఇలా రూ. కోట్ల దండుకున్నాడని.. దర్యాప్తులో మరిన్ని అంశాలు తేలే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన కొన్ని కంపెనీలు మోస పోయాయని చెబుతున్నారు. డార్క్ వెబ్‌లో యాప్స్ ద్వారా ఆయా సంస్థల పేరుతో ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేస్తారట. వాటితో ఆయా కంపెనీల అకౌంట్స్ విభాగాలకు మెయిల్ పంపించి.. డబ్బులను కొల్లగొడతారట. తైవాన్, చైనాకు చెందిన ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్లతో రోనాక్కు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సో.. విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
వందల సంఖ్యలో
తెలంగాణ రాష్ట్రంలోనే వందల సంఖ్యలో రోనాక్ బాధితులు ఉన్నారట.. పెట్టుబడి, వ్యాపారంపై సోషల్ మీడియాలో ప్రచారం చేసే మేనేజర్లు, నకిలీ యాప్స్ తయారు చేసే టెకీలు.. పోలీసుల మాదిరిగా ఆలోచించే సైబర్ సెక్యూరిటీ నిపుణులు రోనాక్ నెట్ వర్క్‌లో పనిచేస్తున్నారని తెలిసింది. వారికి మంచి ప్యాకేజీ ఇస్తాడని.. అందుకే వారు జాబ్ చేస్తున్నారని తెలిపారు. మోసం సంపాదించిన నగదు.. చైనా, తైవాన్‌కు తరలించేవాడని తెలుస్తోంది.