హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పలు పబ్బులపై కేసు నమోదు చేసారు పోలీసులు. భారీ సౌండ్లతో స్థానికులకు ఇబ్బంది కలుగుతుందని కంప్లేంట్ చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
రాజేంద్ర నగర్‌లో నివసించే డాక్టర్ అశాన్ ముస్తఫా ఖాన్ మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ డాక్టర్ తప్పించుకుని పారిపోగా.. పోలీసులు అతని భార్యని అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. ఈక్రమంలో రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఢిల్లీ పక్కనే ఉన్న ఘజియాబాద్‌లో హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. వేవ్ సిటీ ప్రాంతంలో పొగమంచు కారణంగా NH-9పై వాహనం ఢీకొని ఒకరు మరణించారు. ఆ వ్యక్తి మీదుగా వందలాది వాహనాలు రాకపోకలు సాగించాయి.
పొగమంచు కప్పేస్తోంది. రోడ్లపై వాహనాలు ఢీ కొట్టుకుంటున్నాయి. ఒక వ్యక్తిని ఏ వాహనం డ్యాష్ ఇచ్చిందో తెలియదు, ఎన్నికార్లు అతనిపై వెళ్లాయో తెలియదు, అతని బాడీ పార్ట్స్ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
దేశమంతటా సంక్రాంతి సందడి నెలకొంది. రంగురంగుల గాలిపటాలన్నీ ఎగురుతూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో పంతంగి మాంజ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆర్మీ అధికారి మెడపై చైనా మాంజా తగిలి గొంతు కోసింది.
ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలం పినకడిమిలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తమామలు పెడుతున్న వేధింపులు భరించలేక.. ఇద్దరు తోడికోడళ్లు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తెలంగాణలో హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పండుగకు భర్త కొత్త బట్టలు కొనలేదనే కోపంతో భార్య తన ఇద్దరు కూతుళ్లను హత్య చేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకోగానే పట్టాలు తప్పింది.