మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత పి. నర్సారెడ్డి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన ఆరు రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని రామ్ జానకి టెంపుల్‌ను పేల్చేస్తామని పోస్టర్లు వెలిశాయి.
ఎర్రసముద్రంలో హౌతీలు మరోసారి రెచ్చిపోయారు. తమపై దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్ నౌకలపై ఒకేసారి దాడులు చేశారు. రష్యా నుంచి చమురు తీసుకొస్తున్న బ్రిటన్ నౌక మార్లిన్ లువాండా మాత్రం హౌతీల నుంచి తప్పించుకోలేకపోయింది. క్షిపణులు నేరుగా తాకడంతో ఇంధన ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు 83 మిలియన్ డాలర్ల ( ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకు పైమాటే) పరిహారం చెల్లించాలని కోర్టు ట్రంప్‌ను ఆదేశించింది.
గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బ్రిటన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు.
రష్యా విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న ఉక్రెయిన్ సైనికులు 65 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాద ఘటనపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సైనికులపై రష్యా ప్రతీకార చర్యలు చేపడుతోందని ఫైర్ అయ్యింది.
చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. చైనాలోని దక్షిణ ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లో భూమి కంపించింది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది.
ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు. ఈ ఘటన గోవా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవ్ కతియార్ గోవాలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
సిరియా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ నిన్న వైమానిక దాడులు జరిపింది. ఇందులో ఇరాన్ సైనిక సలహాదారులను, హెజ్‌బొల్లా కమాండర్లను హతమార్చింది. కొందరు చనిపోయగా.. పలువురు గాయాలు పాలయ్యారు.
అయోధ్య రామ మందిర ప్రసాదం అంటూ కొందరు ఆన్‌లైన్‌లో నకిలీ ప్రసాదాలు కలకలం రేపేతున్నాయి. అయోధ్య ప్రసాదం పేరిట మిఠాయిలను అమ్ముతోందనే ఆరోపణలతో ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.