దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఖజానాను మోసగిస్తూ ఏర్పాటైన నకిలీ కంపెనీలపై జరుగుతున్న డ్రైవ్లో జీఎస్టీ అధికారులు భారీ మొత్తం ఎగవేతలను గుర్తించారు. దేశవ్యాప్తంగా రూ.10,179 కోట్ల జీఎస్టీ చెల్లింపులను ఎగ్గొట్టిన 10,700 నకిలీ రిజిస్ట్రేషన్లను పట్టుకున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ఆధార్ ధ్రువీకరణ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో అమలవుతోందని, అక్టోబర్ 4 నాటికి మరో నాలుగు రాష్ట్రాలు ఈ జాబితాలో చేరుతాయన్నారు.