HYD: కోట్పల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. ధారూర్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ తన స్పెషల్ టీంతో గస్తీ నిర్వహిస్తుండగా వాగు నుంచి ఇసుకను తీసుకెళ్తున్న వాహనాన్ని పట్టుకొని రేంజ్ ఆఫీసుకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేసి పైఅధికారులు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు రేంజ్ ఆఫీసర్ తెలిపారు.