బర్త్ డే పేరుతో బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో బీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, మోడళ్లు కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లు సమాచారం.
నిత్యం దైవారాధనలో ఉండే పూజారి ఓ టీవీ యాంకర్‌పై దారుణానికి ఒడిగట్టాడు. నమ్మించి తీర్థంలో మత్తిచ్చి లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటా అని దేవుడి మీద ఒట్టుపెట్టి కడుపు చేశాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
స్టేషన్‌లోనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ వ్యక్తి 100 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించాడు. ఇతను వ్యాపారవేత్త కాదు. రాజకీయ నాయకుడు అంతకంటే కాదు. అతను ఒక దొంగ. మొదట్లో రైళ్లలో దొంగతనం చేసే ఇతను విమానాల్లో అయితే ఎవరికి దొరకను కదా అని విమాన ప్రయాణికుల దగ్గర డబ్బు , నగలు దొంగతనం చేసేవాడు.
తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు. షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన ఆమె నిన్న రాత్రి కారులో ఇద్దరు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌కి తిరిగి పయనమవుతుండగా యాక్సిడెంట్‌లో చనిపోయారు.
బెట్టింగ్‌లకు అలవాటు పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వీటి బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి బెట్టింగ్‌లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి అతనిని కొట్టి చంపేశాడు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సీతాపూర్‌కు చెందిన పల్హాపూర్ గ్రామానికి చెందిన అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆప్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తర బగ్లాన్ ప్రావిన్స్‌లో 50 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బాల్యం వివాహం జరుగుతుందని తెలుసుకున్న అధికారులు వధువు ఇంటికి వచ్చి తల్లిదండ్రులను పెళ్లి రద్దుకు ఒప్పించారు. విషయం తెలుసుకున్న వరుడు కోపం అమ్మాయి తల నరికి పారిపోయాడు. అతని కోసం వెతికితే ఓ చెట్టుకు ఉరేసుకొని కన్పించాడు.
ఆన్‌లైన్ పెళ్లి సంబంధాల సైట్ల ద్వారా 25 మందికి పైగా మహిళలను మోసం చేసిన నయా కేడీ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో అతను చేసిన మోసాలకు అధికారులే విస్తుపోయారు.
ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి చాలామంది డబ్బు పొగోట్టుకుంటున్నారు. వీటికి యువత బలి అయిపోతున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పృథ్వీ ఆన్‌లైన్ గేమ్స్‌కి బలి అయి ఆత్మహత్య చేసుకున్నాడు.
జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఉగ్రముప్పు ఉండే ప్రమాదం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటికి ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్ రౌలే, ఐసీసీ ప్రతినిధులు స్పందించారు.