VZM: సోమవారం తెల్లవారుజామున నాతవలస టోల్ ప్లాజా వద్ద విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్లే హైవే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని బిచ్చగాడు మరణించినట్లు డెంకాడ ఎస్ఐ ఏ.సన్యాడినాయుడు సోమవారం తెలిపారు.మృతుడు హైవే రోడ్డు సర్వీసు రోడ్డులో నిద్రిస్తుండగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కేసును హిట్ అండ్ రన్ గా నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.