HYD: బస్సు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ వైపు వెళ్తున్న RTC బస్సు వెనక చక్రాల కింద పడి గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.