ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం జరుగుతుండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బాంబుల మోత మోగించారు. ఈ పేలుడులో వందల సంఖ్యలో మరణించారు.
అస్సాంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
జపాన్‌లో సంభవించిన భూకంపం ప్రజలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా ఎన్నో ఇళ్లు, భవనాలు శిధిలమయ్యాయి. ఈక్రమంలో ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
మణిపూర్‌లో కుకి, నాగ తెగలకు సంబంధించిన గొడవలు ఇంకా చల్లారలేదు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం మళ్లీ హింసను కొనసాగిస్తోంది. ఆకస్మికదాడిలో పోలీసులు, బీఎస్ఎఫ్ అధికారి గాయపడ్డారు.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగర పరిధిలోని పబ్‌లు, బార్‌లు, రిసార్ట్‌ల వద్ద పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రాత్రి 8 గంటల నుంచే తనిఖీలు నిర్వహించి భారీగా కేసులు నమోదు చేశారు.
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని హాల్వి గ్రామానికి చెందిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను బకెట్ నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో పంజాబ్‌కు చెందిన మోడల్‌పై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. మహిళా మోడల్ పంజాబ్‌లోని జలంధర్ నివాసి. షూటింగ్ కోసం డిసెంబర్ 22న తాను సిమ్లాకు వచ్చానని మోడల్ చెబుతోంది.
భారత సంతతికి చెందిని ఓ సంపన్న కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.