ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సారావుపేటలో విషాదం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న 19 ఏళ్ల శిల్ప శిల్పకు రెండు నెలల క్రితం వెంకటేష్ అనే వ్యక్తితో వివాహం కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ క్రమంలోనే ఆమెను భర్త హతమార్చాడని బంధువుల ఆరోపణ భర్త వెంకటేష్ పై అనుమానం వ్యక్తం చేస్తున్న యువతి బంధువులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హన్మకొండ-కరీంనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇసుక లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఢీకొన్న ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
న్యూయార్క్‌లోని లాగ్వార్డియా విమానాశ్రయంలో ఆందోళనకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారి డైపర్‌లో 17 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అకస్మాత్తుగా సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న ఎక్స్-రే మిషన్‌లో అలారం మోగడం ప్రారంభించింది. దీని తరువాత, తనిఖీ సమయంలో, ఒక ప్రయాణికుడు పిల్లల డైపర్‌లో దాచిపెట్టిన 17 తుపాకీ బుల్లెట్లను తీసుకువెళుతున్నట్లు గుర్తించగా..అతడిని అరెస్టు చేశారు.
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లోని విశ్వవిద్యాలయంలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో 14 మంది మరణించారు. దీంతోపాటు డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
బిగ్ బాస్ షోపై మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదు అయింది. రియాలిటీ షో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని, గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన ఘర్షణలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి అని హైకోర్టు న్యాయవాది అరుణ్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే కలికాలం ఇది. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని మాయలోకం. ఆస్తి కోసం ఆరుగురిని చంపిన హృదయవిదారకమైన ఘటన. మక్లూరు వరుస హత్య కేసుల్లో వీడిన మిస్టరీ. మొత్తం ఐదుగురు నిందుతులు పోలీసుల అదుపుల్లో ఉన్నారు.
వాయువ్య చైనాలో సోమవారం అర్ధరాత్రి 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 111 మంది మరణించగా..మరో 200 మందికిపైగా గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం నాలుగు రాష్ట్రాలు, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, మాడ్యూల్ హెడ్‌తో సహా ఎనిమిది మంది ఐఎస్‌ఐఎస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి.. అది తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు.
ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అయితే వారంతా వారం రోజుల్లోనే మరణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.
తార్నాకలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.