హైదరాబాద్ నాంపల్లిలో గల బజార్‌ఘాట్ వద్ద గల అపార్ట్ మెంట్‌లో ఇవాళ ఉదయం 9.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఘోరం జరిగింది. దీపావళికి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
అమీర్‌పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్‌పేట్ పరిధిలోని మధురానగర్‌లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
గుర్తు తెలియని వ్యక్తులతో చాట్ చేయొద్దని.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయొద్దని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య యువతులకు సూచించారు.
హర్యానాలో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతిచెందారు. యమునానగర్, అంబాలా జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ మరణాలు నమోదు అయ్యాయి.
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో ఉన్న దాల్ సరస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టాపాసుల దుకాణంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ క్రమంలో అవి కాస్తా పక్కన ఉన్న ఫుడ్ జోన్ కు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోగా..ఆ మంటలు మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. అయితే
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే అయినా విచక్షణ మరిచిపోయారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలు వలన ముందు గొడవ పడ్డారు, తరువాత మహిళపై కత్తితో దాడిచేయబోయాడు, తప్పించుకున్న మహిళ అదే కత్తితో ఏఈవోను పొడిచింది.
చైనాకు చెందిన అతిపెద్ద బ్యాంకు ICBC అమెరికా యూనిట్‌పై సైబర్‌దాడి జరిగింది. దీంతో ఈ సంస్థ కొన్ని యూఎస్ ట్రెజరీ ట్రేడ్‌లను నిర్వహించలేకపోయింది. పాత సోవియట్ యూనియన్‌లో లేని దేశాలపై సైబర్ దాడులు జరుగుతున్నట్లు సంస్థ చెబుతోంది.
అర్ధరాత్రి రోడ్డు పక్కన నిలిపిన రెండు ప్రయాణికుల బస్సులను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత చెందగా...మరో 27 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
చెత్త కుప్పలో వందల వేల లక్షలు కాకపోయినా కోట్లాది రూపాయలు దొరికితే... ఇలాంటివి మనం సినిమాల్లోనే చూస్తాం. కానీ, బెంగళూరులో చెత్త సేకరించే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఓ ఫంక్షన్ కోసం వెళ్లేందుకు ముగ్గురు యువ స్నేహితులు కలిసి ఒకే బైకుపై బయలు దేరారు. ఆ క్రమంలోనే లేట్ అవుతుందని బైక్ స్పీడ్ పెంచారు. అంతే ఆ క్రమంలోనే బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు చెల్లాచెదురుగా పడిపోయి మృత్యువాత చెందారు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
కల్తీ మద్యం తాగి ఆరుగురు యువకులు మృతిచెందారు. హర్యానాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, పలువురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆధార్ జిరాక్స్ ద్వారా ఓ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా లావాదేవీలు జరిపాడు. అంతేకాకుండా ఆ ఆధార్ కార్డు నంబర్‌ను బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, వివిధ పథకాల్లోని డబ్బులను దోచుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
అధికారుల నిర్లక్ష్యం కాస్తా ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చింది. అవును ఈ ఘటన ఏపీలో విజయవాడలో జరిగింది. అయితే అసలు ఏం జరిగింది? ఎలా బాలుడు మృత్యువాత చెందాడనే వివరాలు ఇప్పుడు చుద్దాం.