»Drug Case Against Controversial Youtube Star Praneet Hanumanth
Praneet Hanumanth: వివాదస్పద యూట్యూబ్ స్టార్ ప్రణీత్ హనుమంత్‌పై డ్రగ్స్ కేసు
తండ్రి, కూతురు బంధానికి అశ్లీల మాటలతో డార్క్ కామెడీ అనే వికృత కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదు అయింది. తాజాగా ప్రణీత్‌పై డ్రగ్స్ కేసు నమోదు చేశారు. సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతడిని ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Drug case against controversial YouTube star Praneet Hanumanth
Praneet Hanumanth: తండ్రి, కూతురు బంధానికి అశ్లీల మాటలతో డార్క్ కామెడీ అనే వికృత కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదు అయింది. తాజాగా ప్రణీత్‌పై డ్రగ్స్ కేసు నమోదు చేశారు. సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతడిని ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హనుమంతు మాదకద్రవ్యాలు, గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అసభ్య పదజాలం కేసు విషయంలో ప్రణీత్‌కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రణీత్‌పై 67బీ ఐటీ యాక్ట్, ఫోక్స్ యాక్ట్, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రణీత్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. పోలీసులు అతడిని విచారించడానికి మూడు రోజులు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రణీత్ హన్మంతు ఓ యూ ట్యూబ్ ఛానెల్లో కంటెంట్ క్రియేటర్‌గా ఉన్నాడు. డార్క్ కామెడీ పేరుతో అనే విషయాలపై కామెంట్లు చేస్తూ ఫన్ జనరేట్ చేస్తుంటాడు. అతనితో పాటు తన స్నేహితుల కలిసి జూమ్ కాల్లో మాట్లాడుతూ రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. ఓ తండ్రి తన కూతుర్ని కొట్టడానికి బెల్ట్ తీస్తాడు. తరువాత బెల్ట్‌పై ఊయల ఊపుతాడు. దానిపై తన స్నేహితులు చెత్త కామెంట్స్ చేశారు. ఆ వీడియోను హీరో సాయి దుర్గ తేజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ట్యాగ్ చేస్తూ దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వెంటనే సీఎం రేవంత్ స్పందించారు. తరువాత మంచు మనోజ్, ఇతర సినీ సెలబ్రెటీలు స్పందించారు. దీంతో ఇతనిపై కేసు నమోదు చేశారు.