చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిను బెంగళూరులో పిలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత రోజు మే 14న తిరుపతి ఎస్ వి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చంద్రగిరి ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లిన పులివర్తి నాని, ఆయన సతీమణి సుధా రెడ్డి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్న వైసీపీ కార్యకర్తలు గురించి పోలీసులకు చెప్తూ వైసీపీ వాళ్ళకి ఇక్కడ ఎం పని అని ప్రశించగా… వారు తిరుగుప్రయాణం అవుతుండగా దాడికి పాల్పడ్డారు. 150 మందికి పైగా కత్తులు, రాడ్లు, బీర్ బాటిల్స్ తో పులివర్తి కారుపై, ఆయనపై దాడి చేశారు అని కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 34మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు, ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు.
ఈ కేసులు 37వ నిందితుడుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును చేర్చారు పోలీసులు. రెండు నెలలు గడిచిన తరువాత ఈరోజు తిరుపతి పోలీసులు మోహిత్ రెడ్డిని బెంగళూరులో దుబాయ్ వెళ్తుండగా అరెస్ట్ చేశారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలనీ పులివర్తి నాని చాల పోరాటం చేశారు. ఫలితాల అనంతరం వైసీపీ ఓడిపోవడం, టీడీపీ గెలవడంతో పోలీసులు ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. మోహిత్ రెడ్డి అరెస్ట్ పట్ల పలువురు టీడీపీ నాయకులూ, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు