టాలీవుడ్ పరిశ్రమలో తాజాగా సంచలనం కలిగించిన ఒక ఘటన జరిగింది. కొద్ది రోజుల క్రితం, Raidurgam పోలీసు స్టేషన్లో ఒక యువతి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ రోజు సినిమా చాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో నటి ఝాన్సీ, కొంతమంది సినీ పెద్దలు, చాంబర్ సభ్యులు పాల్గొన్నారు. ఝాన్సీ మాట్లాడుతూ, బాధితురాలికి ఒక ప్రముఖ స్టార్ హీరో మద్దతు అందిస్తున్నారని వెల్లడించారు. ఈ హీరో ఆమెకు తమ రాబోయే సినిమాల్లో కొరియోగ్రఫీ అవకాశాలు ఇస్తామన్న వాగ్దానాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో, సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఈ స్టార్ హీరోగా అల్లు అర్జున్ పేరు సూచిస్తున్నారు. అల్లు అర్జున్ తన కార్యాలయం ద్వారా బాధితురాలికి కొరియోగ్రఫీ అవకాశాలు ఇచ్చేలా ప్రామిస్ చేసినట్లు వినిపిస్తోంది. ఈ న్యూస్ చక్కర్లు కొట్టే క్రమంలో జనసేన కార్యకర్తలు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య రగడ మొదలయ్యింది.. అల్లు అర్జున్ నంద్యాల ఎన్నికలలో శిల్పా కుటుంబాన్ని మద్దతు తెలిపిన నేపథ్యంలో, బన్ని అభిమానులు, జనసైనికులకు మధ్య సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే.
ఇటీవల, సినిమాకి సంబంధించిన చాంబర్ జానీ మాస్టర్‌ను అన్ని పరిశ్రమ కార్యకలాపాల నుండి సస్పెండ్ చేసింది. ఈ చర్య వల్ల, జానీ మాస్టర్ ప్రస్తుతం సినిమాల షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. తెలుగులోనే కాకుండా జానీ మాస్టర్ తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో కూడా బిజీగా ఉన్న తరుణంలో ఇది చాలా పెద్ద మైనస్ అనే చెప్పాలి