బొగ్గు కంపెనీ భవనంలో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఘటనలో 25 మంది మరణించగా.. డజన్ల కొద్ది సిబ్బంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తర చైనీస్ షాంగ్సీ ప్రావిన్స్‌లోని లులియాంగ్ సిటీలో చోటుచేసుకుంది.
యూపీలోని ఇటావాలో బుధవారం న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రమాదవశాత్త ఒక కోచ్‌లో పెద్ద ఎత్తున మంటలు భారీగా చెలరేగాయి. ఆ క్రమంలో పలువురు ప్రయాణికులు ట్రైన్ నుంచి కిందకు దూకి పారిపోయారు.
షామ్లీలోని మదర్సాలో చదువుతున్న బాలిక వేధింపులకు విసుగు చెంది విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ దోడాలో ఓ బస్సు అదుపు తప్పి దాదాపు 300 అడుగుల లోతున్న గుంతలో ఆకస్మాత్తుగా పడిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో 38 మంది మృత్యువాత చెందగా..మరికొందరికి గాయాలయ్యాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై పోలీసులు 32 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో డాబర్ గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్, చైర్మన్ మోహిత్ బర్మన్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిపై మోసం, జూదం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్మకు పాల్పడిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. 110 రోజులు పాటు వాదనలు విన్న కోర్టు బాలల దినోత్సవం రోజున తీర్పును వెలవరించింది. కోర్టు తీర్పుపై నెటజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఉరిశిక్షే సరియైనది అని అభిప్రాయపడుతున్నారు.
అతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది.
బెట్టింగ్‌కు టెకీ గంగిరెడ్డి బలయ్యాడు. పందెం వేసి రూ.40 లక్షల అప్పు చేశాడు. అది తీర్చలేక.. ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. కట్నం తీసుకొని రావాలని వేధించగా.. తమ్ముని వద్దకు వెళ్లింది. ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి.. వచ్చిన తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. ఆవేశంలో చేయి చేసుకొని హతమార్చాడు.
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా ఓ వ్యక్తితో కలిపి మొత్తం ఆరుగురు మృతి చెందారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెలవులు వచ్చిన క్రమంలో సరదాగా ఎనిమిది మంది యువకులు కీసర మున్నేరు వాగులో ఈతకు వెళ్లారు. ఆ నేపథ్యంలో ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతు కాగా..వారిలో ముగ్గురు మృత్యావాత చెందారు.
మద్యం ఇవ్వలేదని వైన్ షాపునకు నిప్పుపెట్టాడు మధు అనే వ్యక్తి. విశాఖ పట్టణంలో ఈ ఘటన జరగగా.. నిందితుడు మధును పోలీసులు అరెస్ట్ చేశారు.
దీపావళి క్లీనింగ్ వివాదంపై బీహార్ రాజధాని పాట్నాలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీపావళి రోజున క్లీనింగ్‌లో పొరుగింటి ఇంట్లో నీరు పడడంతో గొడవ జరిగినట్లు సమాచారం.
తిరుమల ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బజార్ ఘాట్ ప్రమాదంలో ఓ నాలుగు రోజుల పసికందు చనిపోయింది. చిన్నారి చనిపోవడంతో బంధువులు, స్థానికులు రోదిస్తున్నారు. ప్రమాద స్థలిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు.