కానిస్టేబుల్‌పై మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు సీఐ ఇఫ్తికర్. శకుంతలను వేధించడంతో ఆమె భర్త కానిస్టేబుల్ జగదీశ్ దాడి చేశాడు. తీవ్రగాయాలతో సీఐ ఆస్పత్రిలో చనిపోయాడు.
ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పినందుకు 17 ఏళ్ల అమ్మాయిని సొంత తల్లి, సొదరుడే చున్నీతో బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.
ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న కారు ఆకస్మాత్తుగా కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ పటేల్ కారు ప్రమాదానికి గురైంది. చింద్వారాలో ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ సైడ్ నుంచి వస్తున్న బైక్‌ను ఆయన కారు ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలయ్యాయి.
చత్తీస్‌గఢ్ అసెంబ్లీ జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో జరిగిన ఈఐడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ తల్లి బిడ్డలని తెలిసింది.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పిన ఓ బస్సు.. బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్ పై పడింది. దీంతో నలుగురు దుర్మరణం చెందారు.
బెంగుళూరులో ఓ మహిళా ప్రభుత్వ అధికారిని అర్థరాత్రి కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటన సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడకలసంద్రలోని గోకుల అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో గుర్తుతెలియని వాహనం ఢీకొని కారులో ప్రయాణించేవారు మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు, మేనకోడలు సహా నలుగురు మృతి చెందారు.
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
ఓ ప్రభుత్వ పాఠశాలలో 50 మందికి పైగా బాలికలను అక్కడి ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులతో వేధించారని హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్(haryana womens commission) తెలిపింది. ఈ ఫిర్యాదుల పట్ల ఉదాసీన వైఖరి అవలంభించిన పోలీసులపై కూడా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అసలు ఈ కేసు వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
కొచ్చిలో శనివారం మధ్యాహ్నం హెలికాప్టర్ కుప్పకూలడంతో ఒక నౌకాదళ అధికారి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నేపాల్‌లో ప్రకృతి విలయం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించి సుమారు 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel)పై ఈడీ(ED) పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు ఇచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. ఈ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.